Category: Tollywood

మట్టి కుస్తీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా 

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది.’ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో ‘మట్టి కుస్తీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రవితేజ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సుధీర్ వర్మ, వంశీ, జ్వాలా గుత్తా  తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రవితేజ, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జ్వాలా గుత్తా చిత్రంలోని చల్ చక్కని చిలక పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..’మట్టి కుస్తీ’కి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో సినిమా కూడా చేయాలని విష్ణుతో చెప్పాను. రిచర్డ్స్ వండర్ ఫుల్  కెమరామెన్. దర్శకుడు చెల్లా అయ్యావు కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను. తన సెన్స్ ఆఫ్ హ్యుమర్ బావుంటుంది. తనతో ఓ సినిమా మాత్రం చేయాలి. అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మీ. ఇందులో ఆమె పాత్రని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విశాల్, ఐశ్వర్య కెమిస్ట్రీ స్టన్నింగా వుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. ఎమోషన్, ఫ్యామిలీ, లవ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ వున్నాయి. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ రెండు టీములు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధులు అభిమానులే. హీరోగా ఎంతో సపోర్ట్ చేశారు. నిర్మాతగా కూడా సపోర్ట్ చేసేయండి. విష్ణు విశాల్ పాజిటివ్ పర్శన్. ఫస్ట్ మీటింగ్ లోనే విశాల్ నాకు ఎప్పటి నుండో తెలుసనే ఫీలింగ్ కలిగింది. అన్నీ సింగిల్ సిట్టింగ్ లోనే మొదలైపోయాయి. సినిమా చాలా బావొచ్చింది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 2న థియేటర్లో కలుద్దాం” అన్నారు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘మట్టి కుస్తీ’ డిసెంబర్ 2 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా వుంది.  రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనది చాలా మంచి మనసు. ఒక్క మీటింగ్ లోనే నాపై పూర్తి నమ్మకం ఉంచారు. జ్వాలా నన్ను తెలుగు సినిమాలు చేయాలనీ చెప్పేది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ని ప్రేమిస్తారు. రవితేజ గారి లాంటి గొప్ప వ్యక్తి సపోర్ట్ తో మీ ముందుకు వస్తున్నాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఆడ మగ సమానమనే సందేశాన్ని చాటే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులు సినిమాని చాలా ఇష్టపడతారు. డిసెంబర్ 2న అందరూ థియేటర్ కి వెళ్లి ‘మట్టి కుస్తీ’ చూడాలి” అని కోరారు. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..  ‘మట్టి కుస్తీ’చక్కని సినిమాని నిర్మించిన రవితేజ గారు, విష్ణు విశాల్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 2న మీ ఫ్యామిలీ అందరికీతో కలసి థియేటర్లో ‘మట్టి కుస్తీ’ ని చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు దర్శకుడు చెల్లా అయ్యావు మాట్లాడుతూ.. రవితేజ గారు ‘మట్టి కుస్తీ’ ని నిర్మించడం చాలా ఎక్సయిటింగా వుంది. రవితేజ గారి కి తమిళనాడులో కూడా భారీ ఎత్తున అభిమానులు వున్నారు. క్రాక్ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆ సినిమాని చాలా మంది రీమేక్ చేయాలని భావించారు.  అయితే రవితేజ గారు బాడీ లాంగ్వేజ్, స్టయిల్ రిప్లేస్ చేయడం చాలా కష్టం. రవితేజ గారు త్వరగా తమిళ్ లో సినిమా చేయాలి. విష్ణు విశాల్, ఐశ్వర్య అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. డిసెంబర్ 2న అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.  జ్వాలా గుత్తా మాట్లాడుతూ.. విష్ణుని తెలుగులో రమ్మని మూడేళ్ళుగా అగుడుతున్నాను. తన చిత్రాల కంటెంట్ బావుటుంది. రవితేజ గారికి ని నేను పెద్ద అభిమానిని. విశాల్ పై రవితేజ గారు మొదటి మీటింగ్ లోనే ఎంతో నమ్మకం ఉంచారు. ఇది చాలా గ్రేట్.’మట్టి కుస్తీ’ కోసం  అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ పుట్ పై చాలా హ్యాపీగా వున్నాం. టీం అందరికీ గుడ్ లక్” తెలిపారు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ‘మట్టి కుస్తీ” సినిమా గురించి నాకు తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు వంశీ మాట్లాడుతూ .. ‘మట్టి కుస్తీ” ట్రైలర్ ప్రామెసింగా వుంది. విష్ణు విశాల్ గారు మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తుంటారు. రవితేజ గారు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమా ప్రత్యేకంగా వుంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు. అజయ్ మాట్లాడుతూ.. ‘మట్టి కుస్తీ’లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తా, కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. రవితేజ గారు నిర్మించారు మరింత ఎక్సయిటింగా అనిపించింది. విష్ణు విశాల్ విలక్షణమైన కథలు ఎంచుకొని విజయాలు సాధిస్తుంటారు. ‘మట్టి కుస్తీ’కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది” అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విష్ణు విశాల్ సినిమాలు డిఫరెంట్ గా వుంటాయి. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. రవితేజ గారు ఒక సినిమా ఎంపిక చేసుకున్నారంటే ఖచ్చితంగా అద్భుతంగా వుంటుంది. . ‘మట్టి కుస్తీ’టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు. జస్టిన్ ప్రభాకరన్ మాట్లాడుతూ..  ‘మట్టి కుస్తీ’ నాకు చాలా స్పెషల్ మూవీ. డియర్ కామ్రేడ్, రాధే శ్యామ్ లో నేను చేసిన మ్యూజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన రవితేజ గారికి, విష్ణు విశాల్ కి థాంక్స్. ‘మట్టి కుస్తీ’ మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు. రిచర్డ్ ఎం నాథన్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళుతోంది. ఇక్కడ ప్రేక్షకులు సినిమాని ప్రేమిస్తారు.’మట్టి కుస్తీ’ కచ్చితంగా మీకు నచ్చుతుంది. రవితేజ గారు నిర్మాత ఈ సినిమాని ఎంత అద్భుతంగా చేశారో క్యాలిటీ చూస్తే తెలిసిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” తెలిపారు. రాకేందుమౌళి మాట్లాడుతూ.. ‘మట్టి కుస్తీ’ డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ రాశాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక అద్భుతమైన సందేశం ఎమోషనల్ గా చెప్పిన చిత్రమిది. రవితేజ, విష్ణు విశాల్ తో పని చేయడం చాలా ఆనందంగా వుంది.  డిసెంబర్ 2న సినిమా విడుదలౌతుంది. మీ అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి.

డిజే టిల్లు స్క్వేర్ .. తప్పుల మీద తప్పులు

డిజే టిల్లు.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార బ్యానర్ నిర్మించిన సినిమా. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిందీ చిత్రం. ఎవరూ ఊహించని రేంజ్ లో డిజే టిల్లు…

కాంతార విషయంలోనూ అదే జరిగింది..

సినిమా పరిశ్రమలకు ఓటిటి రూపంలో కొత్త మార్కెట్ వచ్చిందనుకున్నారు. మొదట్లో బానే ఉన్నా.. తర్వాత ఈ మార్కెట్ మొత్తానికే ఎసరు పెట్టేస్తోంది. ఆ మేటర్ ఎలా ఉన్నా.. కొన్నాళ్లుగా.. సినిమా థియేటర్ కు, ఓటిటికి అస్సలు పడటం లేదు. యస్.. ఒక…

యశోద నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రెస్ మీట్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘యశోద’. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం…

ఇన్నాళ్లూ వేచిన సినిమా మొదలైంది

కొన్ని కాంబినేషన్స్ అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఆకర్షిస్తాయి. అలాంటిదే ఆ మధ్య అనౌన్స్ అయిన ధనుష్‌ – శేఖర్ కమ్ముల కాంబినేషన్. శేఖర్ సెన్సిబుల్ మూవీస్ తో టాలీవుడ్ లో తనకంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనుష్ ఇప్పటికే…

విజయ్ దేవరకొండ నిర్మాతలు మారుతున్నారా

ఒకటీ రెండు సినిమాలతోనే ఓ రేంజ్ లో ఫేమ్ అయిన స్టార్ విజయ్ దేవరకొండ. అతని యాటిట్యూడ్ కు యూత్ అంతా ఫిదా అయిపోయింది. బట్ అదే యాటిట్యూడ్ తో తర్వాత లాస్ అయ్యాడు. దీనికి తోడు వరుసగా వచ్చిన ఫ్లాపులు…

ఎన్టీఆర్.. నీ కథ చేస్తున్నా.. ఓకేనా.. ?

స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదు అంటాడో సినీ కవి. ఆ మాటను అక్షరాలా పాటించే స్నేహితులు అరుదుగా ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పై చేయిగా ఉండాలని భావించే సినిమా పరిశ్రమలో మరీ అరుదుగా ఉంటారు. ఆ అరుదైన లిస్ట్…

అతిరథ మహారధులకు కృతజ్ఞతలు– డాక్టర్‌ ఆలీ

మా అమ్మాయి  ఫాతిమా విహహం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. వధూవరులను ఆశీర్వదించటానికి సినిమా రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు పాల్గొని వధువు ఫాతిమా వరుడు షహయాజ్‌లను నిండుమనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌…

‘మసూద’ విజయంపై హీరో తిరువీర్ ఇంటర్వ్యూ

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి…

రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో `నాగలి`

1995లో `తపస్సు`  అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో `నాగలి`…