‘దేవర‘ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘దేవర‘. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లోని ఫస్ట్ పార్ట్.. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకు ముస్తాబవుతోంది. ఇక.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర‘ నుంచి క్రేజీ అప్డేట్ అందించేందుకు రెడీ అవుతోంది టీమ్. తారక్ బర్త్ డే స్పెషల్ గా ‘దేవర‘ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారట.

తాను కంపోజ్ చేసిన పాటల ఆల్బమ్స్ ను ప్రమోట్ చేయడంలో ముందుంటాడు అనిరుధ్ రవిచందర్. ఈకోవలోనే.. ‘దేవర‘ ఫస్ట్ సింగిల్ కోసం అనిరుధ్ తో ఓ మ్యూజికల్ వీడియోని షూట్ చేస్తున్నారట. చెన్నైలో ఈ చిత్రీకరణ సాగుతున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ‘దేవర‘ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts