సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్‘కి సీక్వెల్ గా ‘మాయా వన్‘

జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన‘తో మంచి విజయాన్నందుకున్న సందీప్ కిషన్ పుట్టినరోజు ఈరోజు (మే 7). ఈ సందర్భంగా.. తన హిట్ మూవీ ‘మాయవన్‘కి సీక్వెల్ అనౌన్స్ చేశాడు. సీక్వెల్ టైటిల్ ‘మాయా వన్‘.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా 2017లో ‘మాయవన్‘ సినిమా వచ్చింది. సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్‘గా అనువాదమయ్యింది. ఇప్పుడు సీక్వెల్ మూవీని సైతం సి.వి.కుమార్ తెరకెక్కిస్తుండగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోవైపు.. సందీప్ కిషన్ హీరోగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ‘వైబ్‘ పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక.. ‘ధమాకా‘ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని చేస్తున్నాడు సందీప్ కిషన్. ఇంకా.. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్‘ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Related Posts