ఓటు విలువ చెబుతోన్న ‘కమిటీ కుర్రోళ్లు‘

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలో స్పీడు పెంచారు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా తనవంతుగా ఓటు విలువ తెలుపుతూ ఓ పాట వదిలింది.

నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు‘. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌ లో రాబోతున్న ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ పరిచయమవుతున్నారు. యదు వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతాన్న సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘గొర్రెల‘ అంటూ సాగే పాట విడుదలైంది.

ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలని చెబుతూ సందేశాత్మకంగా ఈ పాటను డిజైన్ చేశారు. అలాగే.. ఓటుకి అమ్ముడుపోయే జనాల్ని గొర్రెలతో పోల్చుతూ నాగ్ అర్జున్ రెడ్డి రాసిన ఈ సాంగ్ లిరిక్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

Related Posts