కొత్త ‘బాహుబలి’ కోసం రంగంలోకి రాజమౌళి

‘బాహుబలి’ మరో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ ఇప్పుడు యానిమేషన్ రూపంలో సందడి చేయబోతుంది. ‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్’ టైటిల్ తో ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అయితే.. ఇదంతా కొత్త కథతో రూపొందడం విశేషం. ఒకవిధంగా.. ‘బాహుబలి.. ది బిగినింగ్, ది కంక్లూజన్’లకు ప్రీక్వెల్ గా ‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్’ వస్తోందని చెప్పొచ్చు.

ఈ కొత్త యానిమేటెడ్ సిరీస్ లో బాహుబలి, భళ్లాలదేవ కలిసి రక్తదేవ్ అనే విలన్ తో తలపడనున్నారు. లేటెస్ట్ గా ‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్’ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. కాంగ్, నవీన్ జాన్ లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను రాజమౌళి, శోభు యార్లగడ్డ, డెవరాజన్ లు సంయుక్తం గా నిర్మించారు. ఈ సిరీస్ పలు భాషల్లో మే 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి దర్శకధీరుడు రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు.

Related Posts