పవన్ కళ్యాణ్ కి హీరో నాని సపోర్ట్

రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి.. మెగా హీరోల సపోర్ట్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది హీరోలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ లిస్టులో నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా తన మద్దతు ప్రకటించాడు నాని.

‘డియర్ పవన్ కళ్యాణ్ గారు, త్వరలో మీరు పెద్ద పొలిటికల్ బ్యాటిల్ ను ఎదుర్కోబోతున్నారు. మీ సినీ కుటుంబంలో సభ్యుడిగా ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలని.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని‘ తెలుపుతూ పవన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు నాని. అలాగే.. చిత్ర పరిశ్రమ అంతా పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పవన్ గురించి నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Related Posts