మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, లక్నో లలో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. లేటెస్ట్ గా ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ అమెరికా వెళ్లబోతుందట.
అమెరికాలో కొంత టాకీ పార్ట్ తో పాటు.. పాటల చిత్రీకరణ పూర్తిచేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజాకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తిచేసుకోనున్న ‘మిస్టర్ బచ్చన్’ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.