మే 10 గ్రాండ్ లెవెల్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ రీ-రిలీజ్

దశాబ్దాల తర్వాత తెలుగులో వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను గ్లోబల్ స్టార్స్ గా మార్చిన చిత్రమిది. దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పిన చిత్రరాజం ‘ఆర్.ఆర్.ఆర్’. ప్రపంచవ్యాప్తంగా రూ.1387 కోట్లు కొల్లగొట్టిన ‘ఆర్.ఆర్.ఆర్’ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన పెన్ మూవీస్.. మరోసారి ఈ మేగ్నమ్ ఓపస్ ను థియేటర్లలోకి తీసుకొస్తుంది. మే 10న తెలుగుతో పాటు హిందీలోనూ 2డి, 3డి లలో ‘ఆర్.ఆర్.ఆర్’ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్నట్టు పెన్ మూవీస్ తెలిపింది. ఈ వేసవిలో సరైన సినిమాలు లేక ఖాళీగా ఉన్న థియేటర్లను మళ్లీ ప్రేక్షకులతో నింపడంలో ‘ఆర్.ఆర్.ఆర్’ విజయవంతమవుతుందనే ఆశాభావంతో ఉంది పెన్ మూవీస్.

Related Posts