‘స్వయంభు‘ కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్

‘కార్తికేయ 2‘తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్నాడు నిఖిల్. ఒకవిధంగా ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సాగుతోన్న డివోషనల్ ట్రెండ్ కి ‘కార్తికేయ 2‘ శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ‘కార్తికేయ 2‘ తర్వాత నిఖిల్ నుంచి మళ్లీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ తో రానున్న మూవీ ‘స్వయంభు‘. పీరియడ్ యాక్షన్ డ్రామాగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘స్వయంభు‘ సినిమాలో నిఖిల్ కి జోడీగా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ సంయుక్త నిర్మాణంలో టాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ప్లస్ కానున్నాయి.

ఈ సినిమాకోసం యుద్ధ వీరుడిగా సరికొత్తగా మేకోవర్ అయ్యాడు నిఖిల్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలైతే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ‘స్వయంభు‘ కోసం తెరకెక్కిస్తున్న 12 రోజుల పాటు సాగే ఓ యుద్ధ సన్నివేశానికి ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఒక వార్ సీక్వెన్స్ కోసమే ఈ రేంజులో ఖర్చుపెడితే.. మొత్తం సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts