‘కంగువ‘ నుంచి సూర్య కొత్త లుక్

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో సూర్య నటిస్తున్న ‘కంగువ‘ ఒకటి. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పది భాషల్లో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజయ్యింది. టీజర్ లో సూర్య కంప్లీట్ పీరియడిక్ మేకోవర్ తో మెస్మరైజ్ చేశాడు.

తాజాగా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం నుంచి సూర్యకి సంబంధించిన మరో లుక్ రిలీజయ్యింది. ఇందులో సూర్య మోడర్న్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి.. ఈ సినిమా గత కాలానికి, ప్రస్తుత కాలానికి లింక్ పెట్టేలా టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏదేఏమైనా.. ఈ న్యూ లుక్ లోనూ విలక్షణ నటుడు సూర్య అదరగొడుతున్నాడు.

Related Posts