మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది.. అలాంటి సొసైటిలో నా వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే కొడుకు కథతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామాగా ‘సత్య’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో హమరేశ్, ప్రార్ధనా సందీప్‌లు జంటగా నటించగా.. వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది ‘సత్య‘ చిత్రం. ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మే 10న ‘సత్య‘ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత శివ మల్లాల.

Related Posts