‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ‘మహాభారత్‘ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో పలు భాషల నుంచి భారీతారాగణం నటిస్తుంది. వారిలో బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఒకడు.

ఆమధ్య ‘కన్నప్ప‘ సెట్స్ లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ‘కన్నప్ప‘ మూవీలో అక్షయ్ కుమార్ పాత్ర మొత్తం షూటింగ్ పూర్తయ్యిందట. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం ఉంది.

Related Posts