‘ఇండియన్ 2‘ కంటే ముందు ‘ఇండియన్‘ రిలీజ్

ఈమధ్య తెలుగు, తమిళం భాషల్లో రీ రిలీజుల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో.. కమల్ హాసన్-శంకర్ కలయికలో వచ్చిన ‘ఇండియన్‘ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ‘ఇండియన్ 2‘ జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక.. ‘ఇండియన్ 2‘ విడుదలయ్యే ముందే ‘ఇండియన్‘ని రీ రిలీజ్ రూపంలో థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

కథ ప్రకారం కూడా ‘ఇండియన్‘కి కొనసాగింపుగా ‘ఇండియన్ 2‘ ఉండబోతుంది. ఆ విధంగానూ ‘ఇండియన్‘ రీ రిలీజ్ ‘ఇండియన్ 2‘కి బాగా కలిసొచ్చే అంశం అని భావిస్తున్నారట మేకర్స్. మరోవైపు.. మే నెలలో ‘ఇండియన్ 2‘ చిత్రానికి భారీ స్థాయిలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిథులుగా సందడి చేయనున్నారట. తమిళ వెర్షన్ రీ సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ ను రజనీకాంత్.. ‘ఇండియన్ 2‘ తెలుగు వెర్షన్ ‘భారతీయుడు 2‘ ప్రమోషనల్ కంటెంట్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించాలనేది శంకర్ ప్లాన్ అట.

Related Posts