రొమాంటిక్ మోడ్ లో ‘సత్యభామ’

కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కడపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ ఆలపించిన ‘కళ్లారా చూసాలే’ అంటూ సాగే గీతం విడుదలైంది. రాంబాబు గోసాల ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్ అందించారు. కాజల్, నవీన్ చంద్ర మధ్య చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మే 17న ‘సత్యభామ’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts