2025 సంక్రాంతి రచ్చ అప్పుడే మొదలయ్యింది!

సంక్రాంతి అంటేనే తెలుగు ఇండస్ట్రీకి సమ్ థింగ్ స్పెషల్. సంక్రాంతి బరిలో తమ సినిమాలను విడుదల చేస్తే.. కలెక్షన్లకు ఢోకా ఉండదనేది వారి నమ్మకం. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ఇంకా ముగియలేదు. అప్పుడే 2025 సంక్రాంతి రచ్చ మొదలైంది. వచ్చే యేడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ అధికారికంగా విడుదల తేదీ ఖరారు చేసుకుంటే.. మరో మూడు సీక్వెల్ మూవీస్ కూడా రాబోయే సంక్రాంతిపైనే కన్నేశాయట.

చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార‘ ఫేమ్ వశష్ట తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘విశ్వంభర‘ అనే టైటిల్ ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ.. వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్ అనౌన్స్ చేసి.. ఓ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇక.. రాబోయే సంక్రాంతికి చిరంజీవితో పాటు.. నటసింహం బాలకృష్ణ నటించే ‘అఖండ 2‘ కూడా రానుందట. చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడితే.. ఆ సమరం మామూలుగా ఉండదు.

చిరు ‘విశ్వంభర‘, బాలయ్య ‘అఖండ 2‘తో పాటు.. నాగార్జున కూడా వచ్చే సంక్రాంతికి ఒక సినిమాని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట. సంక్రాంతి బరిలో ఇప్పటికే సూపర్ హిట్స్ అయిన ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ సిరీస్ లోనే ఆ మూవీ ఉండనుందట. గతంలో సంక్రాంతి కానుకగా హిట్టైన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శతమానం భవతి‘కి కూడా ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ‘శతమానం భవతి 2‘ని వచ్చే సంక్రాంతికి తీసుకురానున్నాడట దిల్ రాజు.

Related Posts