రాజమౌళి-మహేష్ సినిమాలో నాగార్జున?

టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ అందగాళ్లు ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా వుంటుంది.. ఆ ఫ్రేముకే అందమొస్తుంది. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి అదే ప్రయత్నంలో ఉన్నాడట. మహేష్ బాబు తో తెరకెక్కించే చిత్రంలో ఓ కీలక పాత్రకోసం కింగ్ నాగార్జున ను తీసుకునే సన్నాహాలు చేస్తున్నాడట.

‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు.. రెండు కీలక పాత్రల కోసం బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, అలియా భట్ లను తీసుకున్నాడు. ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా ఓ ప్రధాన పాత్ర కోసం నాగార్జున ను సంప్రదిస్తున్నాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబోలో నటించడానికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఈ మూవీలో మహేష్ కి జోడీగా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ఎంపిక దాదాపు ఖరారయినట్టు తెలుస్తోంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె ని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాడట జక్కన్న. మొత్తంమీద.. టాలీవుడ్ సీనియర్స్ లో ఇప్పటికే వెంకటేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘ చేసిన మహేష్.. ఇప్పుడు నాగార్జునతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటాడేమో చూడాలి.

Related Posts