‘యోధ‘ ట్రైలర్.. సిద్ధార్థ్ మల్హోత్రా మరో దేశభక్తి చిత్రం

బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా లేటెస్ట్ మూవీ ‘యోధ‘. ఈ సినిమాలో సిద్ధార్థ్ కి జోడీగా రాశీఖన్నా నటించింది. మరో కీ రోల్ లో దిశా పఠాని కనిపించబోతుంది. బీటౌన్ లో వరుసగా పేట్రియాటిక్ మూవీస్ తో అలరిస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి వస్తోన్న మరో దేశభక్తి చిత్రమిది. సాగర్ ఆంబ్రీ, పుష్కర్ ఓజా సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మార్చి 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘యోధ‘ ట్రైలర్ రిలీజయ్యింది. ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ తో ‘యోధ‘ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

Related Posts