కృష్ణ పుట్టినరోజున సుధీర్ బాబు ‘హరోం హర‘

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది. ఆద్యంతం పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో ఙ్ఞానశేఖర్ ద్వారక రూపొందుతోన్న ఈ సినిమాని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. తాజాగా ‘హరోం హర‘ సినిమా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘హరోం హర‘ను విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీగా మాళవిక శర్మ నటిస్తుంది. మరో కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన పాటలూ ఆకట్టుకున్నాయి. మొత్తంమీద.. పాన్ ఇండియా లెవెల్ లో ‘హరోం హర‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts