సెప్టెంబర్ నుంచి నాగచైతన్య-కార్తీక్ దండు చిత్రం

అక్కినేని నాగచైతన్య సినిమాల సెలక్షన్ ఎప్పుడూ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ‘దూత‘ సిరీస్ విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చైతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘తండేల్‘తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చైతన్య.. ‘విరూపాక్ష‘ ఫేమ్ కార్తీక్ దండు తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటన రాకపోయినా.. ఈ చిత్రాన్ని ఎస్వీసిసి బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న చైతన్య-కార్తీక్ దండు మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ చిత్రాన్ని కూడా ‘విరూపాక్ష‘ తరహాలో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నాడట కార్తీక్ దండు. నాగచైతన్య కి కూడా ఇలాంటి జోనర్ లో చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతోంది. త్వరలోనే.. చైతన్య-కార్తీక్ దండు మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts