‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ టీజర్.. విశ్వక్ సేన్ ఊర మాస్ అవతార్..!

‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్ రిలీజయ్యాయి. ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీమ్. మాస్ కా దాస్ అన్న పదానికి అసలు సిసలు నిర్వచనంలో ఉండే విశ్వక్ సేన్.. ఈ టీజర్ లో ఊర మాస్ అవతార్ లో రెచ్చిపోయాడు.

టీజర్ విషయానికొస్తే.. ‘ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని చంపకుండా వదలరు.. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట.. ఇంక వాడిని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి..‘ అంటూ విశ్వక్ కి వస్తోన్న ఆపద గురించి సాయికుమార్ చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఇక.. పవర్ ఫుల్ లుక్ లో ఎంటరైన విశ్వక్ సేన్ ‘అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కొక్కడికి శివాలెత్తిపోతుందంతే..‘ అంటూ విలన్ల భరతం పట్టడం టీజర్ లో ఆకట్టుకుంటుంది. ఇంకా.. ‘నేను మంచోడినో.. చెడ్డోడినో నాకు తెలీదు.. కానీ మంచోడిని అనే చెడ్డ పేరు నాకొద్దు‘ అంటూ చెప్పే విశ్వక్ సేన్ డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. మే 17న వరల్డ్ వైడ్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ విడుదలకు ముస్తాబవుతోంది. ఓవరాల్ గా టీజర్ తో అంచనాలను తారాస్థాయిలో నిలిపిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts