జూన్ 27న ‘కల్కి‘.. కొత్త పోస్టర్ తో క్లారిటీ

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే జూన్ 27న ‘కల్కి‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె లతో కూడిన ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ ఎంతో వైవిధ్యంగా ఆకట్టుకుంటోంది.

అసలు మే 9న ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండడం.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వకపోవడం వంటి కారణాలతో ఈ చిత్రాన్ని జూన్ 27కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక.. కేవలం రెండు సినిమాల అనుభవమే ఉన్నా.. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై రాని నెవర్ బిఫోర్ స్టోరీతో ‘కల్కి‘ని తీర్చిదిద్దుతున్నాడట నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ కథాంశానికి మహాభారత ఇతిహాసాన్ని ముడిపెడుతూ ‘కల్కి‘ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడట. మొత్తంమీద.. ‘కల్కి‘ ప్రభాస్ కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీస్ గా నిలవబోతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.

Related Posts