రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఫ్లాపేనా..?

టైటిల్ చూసి ఇదేదో నెగెటివ్ న్యూస్ అనుకోకండి. ఈ మాట అనడానికి ఓ రీజన్ ఉంది. ఆ తర్వాత ఏదైనా కమెంట్ చేయొచ్చు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ ను ఆచార్యతో పూర్తి చేసుకున్నాడు రామ్ చరణ్‌. వెంటనే మరో ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో సినిమా సెట్ అయింది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ చిత్రం గ్రాండ్ గానే ప్రారంభం అయింది. గత సంక్రాంతికే వస్తుందనుకున్నారు కూడా. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.

బట్ ఈ లోగా శంకర్ కు భారతీయుడు2నే ముందు పూర్తి చేయాలి అని కోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది. అంతకు ముందు ఆగిపోయిన ఆ సినిమా గురించి నిర్మాతలు కోర్ట్ లో కేస్ వేస్తే.. శంకర్ కు వ్యతిరేకంగా, నిర్మాతలకు ఫేవర్‌ గా తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ గేమ్ లో చేంజెస్ వచ్చాయి. ముందుగా భారతీయుడు2 చేస్తున్నాడు. కొన్నాళ్లు గేమ్ ఛేంజర్ ను కూడా షూట్ చేశాడు. బట్ కుదర్లేదు. దీంతో పూర్తిగా కమల్ సినిమాపైనే ఫోకస్ చేశాడు. ఇక వచ్చే మంగళ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది అంటున్నారు. బట్ అఫీషియల్ గా చెప్పలేదు.


ఇక రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఫ్లాపేనా అనేది ఈ చిత్రం గురించి కాదు. బుచ్చిబాబుతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు కదా.. ఆ సినిమా గురించి. మరి ఈ సినిమా ఇంకా స్టార్ట్ కూడా కాలేదు.. అప్పుడే ఫ్లాప్ అని ఎలా అంటారు అనుకుంటున్నారా..? దానికో కారణం ఉంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ఎంత బడ్జెట్ అయిన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సో.. రెహ్మాన్ ను తేవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.


కెరీర్ ఆరంభం నుంచి ఏఆర్ రెహ్మాన్ తెలుగులో చేసిన సినిమాలన్నా డిజాస్టర్స్ అయ్యాయి. యస్.. ఇదో సెంటిమెంట్ గానూ మారింది. అందుకే చాలామంది రెహ్మాన్ అంటే భయపడ్డారు. ఆయన ఆస్కార్ సాధించి ఉండొచ్చుగాక.. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయాడు అనేది నిజం. కెరీర్ ఆరంభంలోనే 1994లో అతను వెంకటేష్‌ నటించిన సూపర్ పోలీస్, రాజశేఖర్ నటించిన గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు సంగీతం అందించాడు. ఈ రెండూ డిజాస్టర్లే.

దీంతో అప్పటి నుంచి ఆయన్ని పెట్టుకోవాలని ఎవరూ అనుకోలేదు. కొన్నేళ్ల తర్వాత నానితో మహేష్‌ బాబు ధైర్యం చేశాడు. ఎస్.జే సూర్య డైరెక్షన్ లో రూపొందిన నాని చిత్రానికి సంగీతం ఇచ్చాడు. ఇదీ పోయింది. అటుపై అదే దర్శకుడు మళ్లీ పవన్ కళ్యాణ్‌ సినిమా కొమురం పులి చిత్రానికి తీసుకున్నాడు. ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.

విశేషం ఏంటంటే.. అదే రెహ్మాన్ డబ్బింగ్ సినిమాలతో అదరగొట్టాడు. అలాగే ద్విభాషా చిత్రాలైన ఏ మాయ చేశావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో మెప్పించాడు. మరెందుకో తెలుగులో నేరుగా సినిమాలు చేస్తే మాత్రం అవన్నీ డిజాస్టర్స్ గానే మిగిలాయి. ఇప్పుడు రామ్ చరణ్‌ తో అంటున్నారు. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. ఈ సినిమా కూడా పోతున్నట్టే కదా..?

Related Posts