ఎన్టీఆర్ బెండు తీస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బిగ్ హిట్

. బట్ కొరటాల రీసెంట్ మూవీ ఆచార్య అట్టర్ ఫ్లాప్. దీంతో ఫ్యాన్స్ ముందుగా కొరటాలతో సినిమా చేయొద్దు అన్నారు. అయితే ఎన్టీఆర్ లెక్క వేరే ఉంది. ఆల్రెడీ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇస్తే తనకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఈ విషయం ఇంతకు ముందు త్రివిక్రమ్ తో ప్రూవ్ అయింది. అరవింద సమేతకు ముందు త్రివిక్రమ్ అజ్ఞాతవాసితో డిజాస్టర్ ఇచ్చాడు. అయినా ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తే హిట్ కొట్టాడు. ఇప్పుడు కొరటాల కూడా అదే చేయబోతున్నాడు అనేది అందరి దీమా.

ఇక ఈ సినిమా కోసం చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎలాగూ ఎన్టీఆర్ స్పీడ్ గా ఉన్నాడని ఏకంగా అతని బెండు తీస్తున్నాడట కొరటాల శివ


రీసెంట్ గానే దేవరకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. ఎన్టీఆర్ సహకారం లేకపోతే ఈ షెడ్యూల్ ఇంకా సాగుతూనే ఉండేదట. అంత పెద్ద షెడ్యూల్ ను చాలా షార్ట్ టైమ్ లో ఫినిష్ చేశాడు యంగ్ టైగర్. మరి అంత పెద్ద షెడ్యూల్ తర్వాత హీరో అయితే బ్రేక్ లేదా వెకేషన్ అంటాడు. ఇతను పని రాక్షసుడు కదా. అందుకే వెంటనే మరో భారీ యాక్షన్ షెడ్యూల్ కు ఓకే చెప్పాడు. ఈ షెడ్యూల్ లో సినిమాకే హైలెట్ అనేలా రెండు ఫైట్స్ ను చిత్రీకరించబోతున్నారు. ఒకటి పీటర్ హెయిన్స్ మాస్టర్ మరోటి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన సాల్మన్ మాస్టర్ చేయబోతున్నాడు. అయితే ఈ ఫైట్ సీన్స్ లో ఎన్టీఆర్ బెండు తీస్తున్నారట. ఈ యాక్షన్స్ సీక్వెన్స్ లు ఆర్ఆర్ఆర్ ను మించి అనేలా ఉన్నాయట.

దీంతో ఎన్టీఆర్ ఫిజికల్ గా చాలా స్ట్రెయిన్ అవుతున్నాడు అంటున్నారు. మామూలుగా పీటర్ హెయిన్స్ అంటే రోప్ ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. రోజంతా రోప్ కట్టుకుని లేదా.. కనీసం సగం రోజు అంతా రోప్ ఫైట్ చేయడం అంటే ఒళ్లు హూనం చేసుకోవడమే. బట్ ఎన్టీఆర్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మాస్టర్స్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళుతున్నాడట. అందుకే ఆర్ఆర్ఆర్ ను మించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నాయి అంటున్నారు. మామూలుగానే ఎన్టీవోడి సినిమా అంటే మాస్ కు పండగ లాంటిది. ఇక ఇలాంటి ఫైట్స్ ఉన్నాయంటే కంట్రీ మొత్తం షేక్ అయిపోతుంది కదా..? ఎలాగూ ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కోసమే ఈ సినిమా తీస్తున్నారు. బట్ ఈ యాక్షన్ సీన్స్ చూస్తుంటే.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతారు అంటున్నారు. ఏదేమైనా ఇవన్నీ మనం చూడ్డానికి బానే ఉంటాయి. బట్ చేస్తున్నప్పుడు వాళ్లు ఎంత ఇబ్బంది పడతారో కదా..?

Related Posts