రిపబ్లిక్ డే రేసు నుంచి తప్పుకున్న ‘తంగలాన్‘

రిపబ్లిక్ డే కానుకగా బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలవ్వబోతుంది. రిపబ్లిక్ డే స్లాట్ లో తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. అనువాద రూపంలో పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చాన్నాళ్ల క్రితమే రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది విక్రమ్ ‘తంగలాన్‘. కారణాలు తెలియలేదు కానీ.. ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ కి షిప్టైంది. ‘తంగలాన్‘ ఏప్రిల్ కి వెళ్లడంతో.. ఆ స్లాట్ లో తమిళం నుంచి ‘కెప్టెన్ మిల్లర్‘, అయలాన్‘ తెలుగులో విడుదలకు ముస్తాబవుతున్నాయి.

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ ఇతర కీలర పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళనాట విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్‘ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తెలుగులో విడుదలకాబోతుంది.

రిపబ్లిక్ డే కానుకగా తమిళం నుంచి అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో మూవీ ‘అయలాన్‘. పొంగల్ బరిలో తమిళనాట విడుదలైన ‘అయలాన్‘కి అక్కడ మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగులో జనవరి 26న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘అయలాన్‘ చిత్రం ఏలియన్ బ్యాక్ డ్రాప్ తో వైవిధ్యంగా రూపొందింది.

మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపిక పదుకొనె ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘ఫైటర్‘ కూడా రిపబ్లిక్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. ‘వార్, పఠాన్‘ మూవీస్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హృతిక్, దీపిక ఫైటర్ పైలట్స్ గా కనిపించబోతున్నారు. జనవరి 25న ‘ఫైటర్‘ రిలీజవుతోంది.

Related Posts