సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టుకున్న మల్టీస్టారర్

టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే కథానాయకుల్లో నాగార్జున ఒకరు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు.. మల్టీస్టారర్స్ కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంటాడు కింగ్ నాగార్జున. ఈకోవలోనే తమిళ నటుడు కార్తీతో కలిసి ‘ఊపిరి‘ సినిమాలో నటించాడు. ఇప్పుడు మరో తమిళ నటుడు ధనుష్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈరోజు యాదగిరి గుట్టలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టుకుందట. హీరో ధనుష్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మరో నాలుగు రోజుల్లో కింగ్ నాగార్జున ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ‘తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఏషియన్ గ్రూప్.. ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts