‘టిల్లు స్క్వేర్’ కోసం తనలోని గ్లామర్ యాంగిల్ ను బయటకు తీసిన అనుపమ.. ఇప్పుడు ‘పరదా’ అంటూ మరో వైవిధ్యభరిత పాత్రతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో మరో మలయాళీ బ్యూటీ దర్శన రాజేంద్రన్ కనిపించనుంది. సంగీత ఇతర కీలక పాత్రలో నటిస్తుంది.ఆసక్తికరంగా అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’.
విజయ్ డొంకాడ, శ్రీనివాసులు.పి.వి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పరదా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. ‘ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్..’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజైన ఈ కాన్సెప్ట్ వీడియోని హీరోయిన్ సమంత, దర్శకనిర్మాతలు రాజ్, డీకే సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ‘పరదా’ మూవీ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకుంటున్నాయి.