‘ఆపరేషన్ వాలెంటైన్’ సాంగ్.. దేశభక్తిని చాటే ‘వందేమాతరం’

‘వందేమాతరం’.. దేశభక్తిని చాటే ఈ పదాలను ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. తాజాగా వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కోసం మరోసారి ‘వందేమాతరం’ పదాలతో కూడిన సందేశాత్మక గీతం సిద్ధమైంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచనలో మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను కునాల్ కుండు ఆలపించాడు. ఈ పాటకు రమ్య బెహరా, మిక్కీ జె మేయర్, కృష్ణ తేజస్వి అందించిన కోరస్ అద్భుతంగా ఉంది.

ఆద్యంతం ఎయిర్ లో జరిగే యాక్షన్ తో ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందుతోంది. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ బైలింగ్వల్ గా రాబోతున్న ఈ మూవీని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 16న ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts