లోకేష్ కనకరాజ్ హీరో, శ్రుతి హీరోయిన్.. కమల్ ప్రొడక్షన్

విక్రమ్‘ చిత్రంతో యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ కి గ్రేట్ కమ్ బ్యాక్ అందించాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. యంగ్ అండ్ టాలెంటెడ్ లోకేష్ కనకరాజ్ అప్పుడప్పుడూ కేమియోస్ తోనూ మురిపిస్తుంటాడు. అయితే.. ఈసారి మ్యూజికల్ వీడియో ‘ఇనిమేల్’ కోసం హీరోగా మారాడు. లోకేష్ కి హీరోయిన్ మరెవరో కాదు మల్టీటాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్.

శ్రుతి హాసన్ సంగీతంలో ‘ఇనిమేల్’ మ్యూజికల్ వీడియో రూపొందుతోంది. ఈ పాటను పాడింది శ్రుతి హాసనే. అయితే.. ఈ పాటకు లిరిక్స్ అందిస్తోంది విశ్వనటుడు కమల్ హాసన్. విడుదలకు ముస్తాబైన ‘ఇనిమేల్’ మ్యూజికల్ వీడియో గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్. ‘ఇనిమేల్’ రోల్ రివర్స్ ఇన్ ది న్యూ వర్స్ అంటూ లోకేష్, కమల్, శ్రుతి హాసన్ కలిసున్న ఈ వీడియో ఆకట్టుకుంటుంది.

Related Posts