‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్‘ ట్రైలర్.. మహిష్మతిని కొత్తగా చూపించబోతున్న సిరీస్

దర్శకధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘బాహుబలి‘ సృష్టించిన సంచలన విజయం గురించి తెలిసిందే. ‘బాహుబలి‘ మూవీ సిరీస్ లోని పాత్రలు, ప్రదేశాల ప్రేరణతో ఇప్పటికే ‘బాహుబలి.. బిఫోర్ ది బిగినింగ్‘ అనే టెలివిజన్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి‘లోని పాత్రలతోనే మహిష్మతి సామ్రాజ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ ‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్‘ యానిమేటెడ్ సిరీస్ రూపొందింది. మే 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న ‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్‘ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ ఆద్యంతం బాహుబలి, భళ్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రల చుట్టూ తిరుగుతోంది.

Related Posts