‘జితేందర్ రెడ్డి‘ ట్రైలర్.. ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్

‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ‘హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్’. 1980లలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మే 10న విడుదలకు ముస్తాబైన ‘జితేందర్ రెడ్డి‘ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. 1980 జగిత్యాల ప్రాంతంలోని పాలిటిక్స్, నక్సలిజం.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టిసిపేషన్.. వంటి విశేషాలతో ‘జితేందర్ రెడ్డి‘ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘ఈ దేశం మనకు ఏమిచ్చింది కాదు.. మనం దేశానికి ఏమిచ్చాము‘ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గోపీసుందర్ సంగీతం, వి. ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ వంటివి టెక్నికల్ గా ‘జితేందర్ రెడ్డి‘కి ప్లస్ కానున్నాయి.

Related Posts