‘టిల్లు స్క్వేర్’ నుంచి తమన్ తప్పుకోవడానికి కారణం ఏంటి?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ ‘డీజే టిల్లు‘కి సీక్వెల్ గా రాబోతుంది ‘టిల్లు స్క్వేర్‘. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇక.. ‘డీజే టిల్లు‘ చిత్రంలో పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ఆ సినిమా బి.జి.ఎమ్. కి అంతే పేరొచ్చింది. ‘డీజే టిల్లు’ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ నేపథ్య సంగీతాన్నందించాడు.

‘డీజే టిల్లు’ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచే ‘టిల్లూ స్క్వేర్‘ వస్తోంది. ఈ సీక్వెల్ కి కూడా తమన్ నేపథ్య సంగీతాన్ని అందించాల్సి ఉంది. అయితే.. తమన్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతోనే ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ నుంచి ‘ఓ మై లిల్లీ’ సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత నాగవంశీ తెలిపారు.

హారిక అండ్ హాసిని, సితార సంస్థలకు తమన్ ని ఆస్థాన సంగీత దర్శకుడిగా చెప్పొచ్చు. సితార నుంచి వస్తోన్న ‘ఎన్.బి.కె. 109‘కి మ్యూజిక్ ఇస్తున్నాడు. మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తమన్ కిట్టీలో ఉంది. అలాగే.. సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న మరో మూవీ ‘తెలుసు కదా’కి కూడా తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts