రజనీకాంత్ సినిమా పోస్టర్ షేర్ చేసిన ధనుష్

మాజీ మామా అల్లుళ్లు రజనీకాంత్-ధనుష్ మధ్య బంధం మరోసారి బలపడింది. ధనుష్-ఐశ్వర్య విడిపోయిన తర్వాత.. రజనీకాంత్ కుటుంబానికి సంబంధించిన విషయాలేవీ ధనుష్ నుంచి వినపడ లేదు. సోషల్ మీడియా వేదికగా కూడా రజనీకాంత్ కి సంబంధించి ధనుష్ ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు.

అయితే.. లేటెస్ట్ గా రజనీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు ధనుష్. అంతేకాదు ఈ పోస్ట్ కి తలైవర్, సూపర్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్స్ తగిలించాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. అన్బారివ్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారట. ఇక.. ఈ మూవీ ఫస్ట్ లుక్ లో అయితే సూపర్ స్టార్ కేక అనిపించేలా ఉన్నాడు.

Related Posts