తెలుగు, తమిళ పరిశ్రమల్లో అరుదైన ఘట్టం

ఈ ఏడాది ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాదాపు అందరు స్టార్ హీరోలతో పాటు.. తమిళ ఇండస్ట్రీకి చెందిన అందరు అగ్ర తారలు ఈ ఏడాది తమ సినిమాలను విడుదలకు ముస్తాబు చేస్తున్నారు.

తెలుగు విషయానికొస్తే.. ఈ ఏడాది ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇంకా.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా ఇదే ఏడాది ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నాయి. అంటే.. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగులో ఉన్న అగ్ర తారలంతా ఒకే సంవత్సరంలో సినిమాలు విడుదల చేయడం ఇదే అనే లెక్కలు బయటకు తీస్తున్నారు విశ్లేషకులు.

ఆశ్చర్యకరంగా తమిళంలో కూడా పుష్కర కాలం తర్వాత అందరు అగ్ర తారలు ఒకే ఏడాది తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధపడుతుండడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయినట్టే. ఇక.. మిగిలిన ఈ ఎనిమిది నెలల్లో తమిళం నుంచి కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, విజయ్ ‘గోట్’, సూర్య ‘కంగువ’, రజనీకాంత్ ‘వేట్టయాన్’, అజిత్ ‘విదాముయార్చి’, విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి.

Related Posts