‘టిల్లు స్క్వేర్’ మినీ రివ్యూ

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తదితరులు
సినిమాటోగ్రఫి: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
సంగీతం: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
ఎడిటింగ్‌: నవీన్ నూలీ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: మల్లిక్ రామ్
విడుదల తేది: మార్చి 29, 2024

ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీక్వెల్ అంటే ‘టిల్లు స్క్వేర్’ అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువతకు విపరీతంగా నచ్చింది. డీజే టిల్లు గా సిద్ధు లుక్, మేకోవర్ ఓ కల్ట్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. మరి.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టిల్లు స్క్వేర్’ ఆ అంచనాలను నిలుపుకోవడంలో సఫలమైందా? లేదా? అనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం.

పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డీజే టిల్లు’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో టిల్లుగా ఆన్ స్క్రీన్ పై అమాయకత్వంతో కూడిన క్యారెక్టరైజేషన్, స్టైల్, రొమాన్స్.. అన్నింటిలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు. సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’లోనూ ‘డీజే టిల్లు’కి మిన్నగా డబుల్ డోస్ ఫన్, రొమాన్స్ ఉండబోతుందని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమయ్యింది.

అలాగే.. మొదటి భాగంలో రాధిక పాత్రకు మించిన రీతిలో సెకండ్ మూవీలో లిల్లీ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు ప్రచారం జరిగింది. లిల్లీ రోల్ లో అనుపమ తన బోల్డ్ నెస్ ఆవిష్కరించింది. ఇక.. సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ విషయానికొస్తే.. ఈ సినిమా ట్రెండీ టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి సినిమాలోని సిద్ధు చెప్పే ఒన్ లైనర్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయనే రివ్యూస్ వస్తున్నాయి.

అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా ఉందని అంటున్నారు. కథ పెద్దగా లేక పోయినా హీరో క్యారెక్టర్, డైలాగ్స్, కొన్ని చోట్ల హిలేరియస్ కామెడీ వర్కౌట్ అవ్వడంతో సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

అయితే.. మొదటి భాగంలోని రాధిక మ్యాజిక్ సీక్వెల్ లో మిస్సయ్యిందని వినిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో రాధిక క్యారెక్టర్ వర్కవుట్ అయినట్టు సీక్వెల్ లో లిల్లీ రోల్ వర్కవుట్ అవ్వకపోవచ్చనేది రివ్యూవర్స్ సారాంశం. మొత్తానికి.. మరికొద్ది గంటల్లోనే ‘టిల్లు స్క్వేర్’ ఫైనల్ వర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంది.

Related Posts