‘లెజెండ్’ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది!

నటసింహం బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో ముందు వరుసలో నిలుస్తాడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలూ ‘సింహా, లెజెండ్, అఖండ’ అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇక.. వీరి కలయికలో వచ్చిన ‘లెజెండ్’ చిత్రం విడుదలై 10ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నారు. మార్చి 30 నుంచి ‘లెజెండ్’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.

‘లెజెండ్’ రీ-రిలీజ్ సందర్భంగా భారీ స్థాయిలో ఈ సినిమా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. బాలకృష్ణతో సహా చిత్రబృందం అంతా ఈ వేడుకకు హాజరయ్యింది. ‘లెజెండ్’ టీమ్ ఇలా రీయూనియన్ అవ్వడానికి ప్రధాన కారణం మళ్లీ వీరి కాంబోలో సినిమా రూపొందబోతుండడమే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల సమాచారం. బాలకృష్ణతో బోయపాటి శ్రీను మరో సినిమా చేయబోతున్నాడనేది చాన్నాళ్ల నుంచి వినిపిస్తూ వస్తుంది. ఆ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించబోతుందట. అంటే.. ‘లెజెండ్’ కాంబో మళ్లీ రిపీటయినట్టే కదా!. త్వరలోనే బాలకృష్ణ-బోయపాటి నాల్గవ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.

Related Posts