ఆస్కార్ అందుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్

96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతోంది. ఈ వేడుకల్లో క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన బయోగ్రాఫికల్ డ్రామా ‘ఓపెన్ హైమర్’కి అవార్డుల పంట పండింది. ముఖ్యంగా.. ఈ సినిమాలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో తన నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు రాబర్ట్ డౌనీ జూనియర్.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ లో ఐరన్ మ్యాన్ గా, షెర్లాక్ హోమ్స్ సిరీస్ లో
టైటిల్ రోల్ తోనూ ప్రపంచ సినీ ప్రేమికులను ఆకట్టుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పటివరకూ ఆస్కార్ అవార్డుల్లో మూడుసార్లు నామినేట్ అయ్యాడు. అయితే.. తొలిసారి ఇప్పుడు ‘ఓపెన్ హైమర్’ మూవీకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు.

Related Posts