సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అసలు చాన్నాళ్ల క్రితమే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిన్న షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ టీమ్.. ఇప్పుడు వైజాగ్ లో సందడి చేస్తుందట.

వైజాగ్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఇక.. ఈ సినిమా ముహూర్తం సమయంలో విజయ్ కి జోడీగా శ్రీలీల నటిస్తుందని ప్రకటించారు. ఓపెనింగ్ సెరమనీలో సైతం శ్రీలీల పాల్గొంది. అయితే.. ఆ తర్వాత శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ మూవీలో విజయ్ దేవరకొండకి జోడీగా మమిత బైజు, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts