35 రోజుల్లోనే ‘వెయ్‌ దరువెయ్‌’ పూర్తి చేసాం : దర్శకుడు నవీన్‌ రెడ్డి

సాయిరామ్‌ శంకర్‌ చాలా కాలం తర్వాత హీరోగా రాబోతున్న మూవీ ‘వెయ్‌ దరువెయ్‌’ . యష్‌ శివకుమార్, హెబ్బా పటేల్‌ లీడ్స్ పోషిస్తున్న ఈ సినిమాకి నవీన్ రెడ్డి డైరెక్టర్‌. దేవరాజ్‌ పోతూరు నిర్మించిన ఈ చిత్రం మార్చి 15 న గ్రాండ్ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
తనది కృష్ణా జిల్లా అనీ, సినిమా డిస్ట్రిబ్యూషన్‌ ఫ్యామిలీ కావడం వల్ల సినిమాలతో అనుబంధం ఉందన్నారు నవీన్ రెడ్డి. అలాగే పూణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కోర్స్‌ చేసి వచ్చానన్నారు. ఆ తర్వాత సతీష్‌ వేగేశ్న దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఇప్పుడు ‘వెయ్‌ దరువెయ్‌’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చానన్నారు.
తెలిసిన వాళ్ల ద్వారా నిర్మాత దేవరాజ్ పోతూరుగారితో పరిచయం ఏర్పడింది.

కథ వినగానే ఆయ‌న‌కు న‌చ్చ‌టంతో సినిమా చేయ‌టానికి అంగీక‌రించారు. సినిమాను కేవ‌లం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌టానికి కార‌ణం ప్రీ ప్రొడ‌క్ష‌న్‌పై ఎక్కువ‌గా ప‌ని చేయ‌ట‌మే అన్నారు. ‘వెయ్ దరువెయ్’ తొలి చిత్ర‌మే అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్రెష‌ర్ ఫీల్ కాలేదు. అందుకు కార‌ణం నిర్మాత దేవ‌రాజ్‌గారు, హీరో సాయిరామ్ శంక‌ర్ స‌హా ఎంటైర్ టీమ్ అందించిన స‌పోర్ట్ అనే చెప్పాలి. సాయిరామ్ శంక‌ర్‌ను హీరోగా అనుకుని పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో క‌లిశాం. సాయిరామ్ శంక‌ర్‌గారైతే నా క‌థ‌లోని హీరో బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతార‌నిపించింది. అందుక‌నే ఆయ‌న్ని అప్రోచ్ అయ్యామన్నారు.

కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి వచ్చే సమస్య ప‌రిష్కారం కోసం హీరో ఏం చేశాడు.. ఎందుకు హైద‌రాబాద్ వ‌చ్చాడు.. స‌మ‌స్యను ఎలా ప‌రిష్కరించుకున్నాడ‌నేదే ఈ చిత్ర కంటెంట్‌ అన్నారు డైరెక్టర్ నవీన్ రెడ్డి.
భీమ్స్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మంచి సీనియ‌ర్ ఆర్టిస్టులు న‌టించారు. హీరోయిన్స్‌ యషా శివకుమార్, హెబ్బా పటేల్ కు మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. క‌థ‌లో భాగంగా వారి పాత్రలు ట్రావెల్ అవుతాయి.* ఫ‌స్ట్ కాపీ చూసి నిర్మాత‌గారు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. రెండున్న‌ర గంట‌ల ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్‌ అన్నారు.
నెక్ట్స్‌ సినిమా ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదన్నారు. త్వరలోనే అప్‌కమింగ్ మూవీస్‌ డిటేల్స్ తెలియజేస్తామన్నారు డైరెక్టర్‌ నవీన్‌ రెడ్డి.

Related Posts