విడుదలై రెండేళ్లవుతోన్నా తగ్గని RRR క్రేజ్

దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలై.. ఈ మార్చి 24 కి రెండేళ్లవుతోంది. అయినా.. ఇప్పటికీ ఈ మేగ్నమ్ ఓపస్ కి సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. గ్లోబల్ వేదికపై ఆస్కార్ అవార్డులు అందుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆస్కార్ లోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తావన వచ్చింది. ప్రత్యేకించి ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను కొంచెం సేపు ప్రదర్శించారు.

ఇక.. లేటెస్ట్ గా ఇంగ్లీష్ సింగర్ ఈడ్ షీరన్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాప్ మ్యూజిక్ లో ఎంతో పాపులర్ అయిన ఈడ్ షీరన్.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రంలో ‘నాటు నాటు’ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అలాగే.. 3 గంటల నిడివి ఉన్న పెద్ద సినిమా అయినప్పటికీ ‘ఆర్.ఆర్.ఆర్’ను తాను ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పాడు. ప్రస్తుతం ఈడ్ షీరన్ ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Related Posts