డిసెంబర్ లో వస్తోన్న ‘ముఫాసా.. ది లయన్ కింగ్’

డిస్నీ సంస్థ నుంచి 1994లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ యానిమేటెడ్ మూవీ ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా స్ఫూర్తితోనే ‘బాహుబలి’ వంటి సినిమాలు రూపొందాయి. ఇక.. ‘ది లయన్ కింగ్’ యానిమేటెడ్ సిరీస్ రీమేక్ గా 2019లో ఫోటో రియలిస్టిక్ యానిమేషన్ రూపంలో ‘ది లయన్ కింగ్’ను తీసుకొచ్చింది వాల్ట్ డిస్నీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ అనువాద రూపంలో అదరగొట్టింది.

ఇప్పుడు ‘ది లయన్ కింగ్’ ప్రీక్వెల్ గా ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ రాబోతుంది. ‘ది లయన్ కింగ్’ ఆద్యంతం ముఫాసా తనయుడు సింబా కథతో రూపొందింది. ఇప్పుడు రాబోతున్న ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ ముఫాసా ప్రస్థానం గురించి చూపించబోతున్నారు. బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది డిస్నీ. ట్రైలర్ ఆద్యంతం విజువల్ ఫీస్ట్ అందిస్తోంది.

Related Posts