అసిస్టెంట్ కి సర్ప్రైజ్ ఇచ్చిన చైతన్య

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తన అసిస్టెంట్ కి సడెన్ సర్పైజ్ ఇచ్చాడు. తన స్టాఫ్ పై ఎంతో ఔదార్యాన్ని చూపించే చైతూ.. ‘తండేల్’ సెట్స్ లో తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్ బర్త్ డే ని గ్రాండ్ గా జరిపాడు. ఈ వేడుకలో హీరోయిన్ సాయిపల్లవితో పాటు డైరెక్టర్ చందూ మొండేటి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టంట చక్కర్లు కొడుతుంది.

ఆన్ స్క్రీన్ పై నాగచైతన్య, సాయిపల్లవి క్యూట్ పెయిర్. ‘లవ్ స్టోరీ‘ చిత్రంతో ప్రేక్షకుల్ని ప్రేమలోకంలో విహరింపజేసిన ఈ జంట.. మరోసారి ‘తండేల్’ కోసం జోడీ కట్టారు. ఈ సినిమాలో రాజు పాత్రలో చైతన్య జాలరిగా కనిపించబోతుండగా.. అతని ప్రియురాలిగా బుజ్జి పాత్రలో సాయిపల్లవి అలరించబోతుంది. ఆమధ్య వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి రిలీజైన స్పెషల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంకా.. ‘ఎస్సెన్స్ ఆఫ్ తండేల్’ అంటూ వదిలిన టీజర్ కూడా ఈ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పరచింది. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో ‘తండేల్’తో సత్తా చాటబోతున్నాడు చైతన్య. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

Related Posts