HomeMoviesటాలీవుడ్కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

-

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్‘. ‘విక్రమ్‘ విజయంతో కమల్ హాసన్.. ‘పొన్నియిన్ సెల్వన్‘ సిరీస్ తో మణిరత్నం మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దీంతో.. ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి చేస్తున్న ‘థగ్ లైఫ్‘పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కమల్ కి జోడీగా త్రిష నటిస్తుంది.

ఇతర కీలక పాత్రల కోసం జయం రవి, దుల్కర్ సల్మాన్ వంటి వారిని అనుకున్నారు. అయితే.. ఈ మూవీ నుంచి జయం రవి తప్పుకున్నాడు. ఆ స్థానంలోనే మరో కోలీవుడ్ స్టార్ శింబు వచ్చి చేరాడు. లేటెస్ట్ గా ‘థగ్ లైఫ్‘లో శింబు నటించబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. న్యూ థగ్ ఇన్ టౌన్ అంటూ ‘థగ్ లైఫ్‘లో శింబు క్యారెక్టర్ ఇంట్రో టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

ఇవీ చదవండి

English News