ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ లిస్టులో రెబెల్ స్టార్ ప్రభాస్ ముందుండగా.. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా అస్సలు ఖాళీ లేకుండా వరుస షూటింగ్స్ తో గడిపేస్తున్నాడు.

ఒకవైపు నాగ్ అశ్విన్ ‘కల్కి‘.. మరోవైపు మారుతితో ‘రాజా సాబ్‘ సినిమాలను ప్యారలల్ గా పూర్తిచేస్తున్నాడు ప్రభాస్. యంగ్ టైగర్ విషయానికొస్తే.. ‘దేవర‘ని ఫినిష్ చేస్తూనే ‘వార్ 2‘పైనా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ఈ రెండు సినిమాలనూ సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నాడు. ప్రభాస్, ఎన్టీఆర్ లు చేస్తుంది.. రామ్ చరణ్ చేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్‘ విడుదలవ్వడం కంటే ముందే శంకర్ తో ‘గేమ్ ఛేంజర్‘ని మొదలుపెట్టాడు రామ్ చరణ్. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ‘గేమ్ ఛేంజర్‘ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒకటి, సుకుమార్ తో మరొకటి లైన్లో పెట్టాడు చెర్రీ. కానీ.. సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లడం కాస్త లేటయినా.. బుచ్చిబాబు మాత్రం రెడీగానే ఉన్నాడు.

దీంతో.. ‘గేమ్ ఛేంజర్‘ తో పాటుగా.. బుచ్చిబాబు సినిమాని కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తే.. సమయం కలిసొస్తుంది కదా అంటూ సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ కి సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్.

Related Posts