‘విశ్వంభర’ సెట్స్ లోకి అడుగుపెట్టిన త్రిష

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే.. త్రిష వంటి బ్యూటీస్ ను చూస్తే ఆ మాట తప్పని అనిపిస్తూ ఉంటుంది. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోన్న త్రిష.. ఇప్పటికీ అదే స్పీడును కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. పైగా.. వయసు పెరుగుతోన్న కొద్దీ త్రిషలో గ్లామర్ కూడా పెరుగుతూనే ఉంది. తమిళంలో ‘96‘ మూవీ కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్‘ సిరీస్ లో కానీ.. త్రిష ను చూసిన ఎవరైనా ఈమాట అనకుండా ఉండలేరు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి మాతృ భాష తమిళం కంటే మిన్నగా తెలుగులో సినిమాలు చేసింది త్రిష. ముఖ్యంగా టాలీవుడ్ లోని అప్పటి ఎ టు జెడ్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేసిన హీరోయిన్ గా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈకోవలోనే.. మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్‘ సినిమాలో నటించింది. ‘స్టాలిన్‘ తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు.. మళ్లీ ‘ఖైదీ నంబర్ 150‘తో రీఎంట్రీ ఇవ్వడం. ఆ తర్వాత చేసిన ‘ఆచార్య‘లో త్రిషను హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. అయితే.. ‘ఆచార్య‘లో తన పాత్ర నచ్చలేదని.. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకోబోతున్నట్టు త్రిష ప్రకటించింది. కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్‘లో అవకాశం రావడం వల్లే ‘ఆచార్య‘ నుంచి త్రిష తప్పుకుందని చిరంజీవి చెప్పడంతో.. వీరిద్దరి మధ్య ఏవో అపొహలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే.. ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఆమధ్య మన్సూర్ ఆలీఖాన్ ఇన్సిడెంట్ లో త్రిషకి తన అండదండలు అందించారు మెగాస్టార్. ఇప్పుడు ‘విశ్వంభర’లో చిరంజీవికి జోడీగా నటస్తుంది త్రిష. వెల్కమ్ ఆన్ బోర్డ్ ది గార్జియస్ త్రిష అంటూ.. ఈ గ్లామర్ బ్యూటీని ‘విశ్వంభర’ సెట్స్ లోకి ఆహ్వానించారు మెగాస్టార్.

Related Posts