క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ‘నైంటీస్’ డైరెక్టర్

ఒకే ఒక్క సినిమా చాలు ఆ డైరెక్టర్స్ ఫేట్ మారిపోవడానికి. ఒక్క విజయం అందిస్తే.. వెంటనే అవకాశాలు వారి ముందుకు క్యూ కడతాయి. ‘నైంటీస్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. అంతకుముందు ఎవరికీ తెలియని ఈ యంగ్ డైరెక్టర్ ఈ సిరీస్ తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్నాడు.

ఇప్పటికే రెండు క్రేజీ ఆఫర్స్ ఆదిత్య హాసన్ ను వరించాయి. వాటిలో ఒకటి నితిన్ హీరోగా నటించే సినిమా కాగా.. మరొకటి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో రూపొందే చిత్రం. నితిన్ హీరోగా అతని సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఆదిత్య హాసన్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట.

మరోవైపు వరుస ప్రాజెక్ట్స్ తో ఇప్పుడు టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనూ ఒక సినిమా చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడట ఆదిత్య హాసన్. నితిన్ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే సితార సంస్థలో మూవీ చేయనున్నాడట ఈ యంగ్ డైరెక్టర్.

Related Posts