Tag: Chiranjeevi

నితిన్ కొత్త కథ ప్రభాస్ స్టోరీలా ఉందే..?

సినిమాలకు సంబంధించి ఒక కథకు మరో కథకూ సిమిలారిటీస్ ఉండటం సహజం. కొన్ని కథలు మాత్రమే ఆల్రెడీ చాలాసార్లు చూశాం కదా అనే ఫీలింగ్ ను ఇస్తాయి. కాకపోతే వీటిలో హీరోల ఇమేజ్ లు, దర్శకుల టేకింగ్ వంటివి కలిసొస్తే రొటీన్…

బాలయ్య అక్కడ స్ట్రాంగ్.. అన్ని చోట్లా వీక్ ..

ఇద్దరు పెద్ద హీరోలు బాక్సాఫీస్ వార్ లో తలపడితే అప్పర్ హ్యండ్ ఎవరిది అని అంతా ఆసక్తిగానే చూస్తారు. ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ వచ్చారు. బాలయ్య.. చిరంజీవి కంటే ఒకరోజు ముందు వచ్చాడు. అప్పటికే సంక్రాంతి ఫీవర్ స్టార్ట్ అయింది…

‘వారసుడు’ తెలుగులో జనవరి 14 న విడుదల

‘వారసుడు’ తెలుగులో జనవరి 14 న విడుదల చేస్తున్నాం. మన తెలుగు బిగ్గర్ స్టార్స్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కి గ్రాండ్ గా విడుదల కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.‘వారసుడు’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది: నిర్మాత దిల్ రాజు దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గానటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది.  ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12 బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి, జనవరి 13న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలౌతున్నాయి. ప్రతి థియేటర్ లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సంక్రాంతి సినిమాలకి మా వారసుడు పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు సంక్రాంతి వారసుడు చేయాలనేదే నా ప్రయత్నం. బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రిలీజ్ కావాలి. తర్వాత నా సినిమా రావాలని పాజిటివ్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరం బావుండాలనే నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.  11న తమిళ్ లో విడుదలౌతున్న ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ కాబోతుంది. ఒక చోట విజయం సాధిస్తే ఆ చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. కాంతార, లవ్ టుడే చిత్రాలు ఇది నిరూపించాయి.  మా గత చిత్రాలు సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి సినిమాల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం వారసుడు. ఒక మంచి సినిమా చుశామనే అనుభూతిని ఇస్తుంది వారసుడు. ఇది దిల్ రాజు బ్రాండ్. తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ ఆల్రెడీ సూపర్ స్టార్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో శరత్ కుమార్,  జయసుధగారు తల్లితండ్రులుగా.. విజయ్, శ్రీకాంత్ శ్యాం బ్రదర్స్ గా కనిపిస్తారు. ఇది పక్కా ఫ్యామిలీ స్టొరీ. ఇందులో ఫ్యామిలీ కోణంలో ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్ ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా ఫీలౌతారు. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు. మా సంక్రాంతి వారసుడు మళ్ళీ సంక్రాంతికి తెలుగులో కూడా ఒక మంచి హిట్ సినిమా కాబోతుంది’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు యునివర్సల్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. మన తెలుగు స్టార్స్ కి గౌరవం ఇస్తూ.. ఇన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాని 14కి వాయిదా వేయడం నిజంగా గ్రేట్. దిల్ రాజు గారికి హ్యాట్సప్. ఇంత సాహసం ఏ నిర్మాత చేయరు. వారసుడు నా తొలి తమిళ సినిమా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారి గురించి చెప్పాలి. విజయ్ తో సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాలా కాలమైయింది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు సినిమాలానే ఫీలౌతాము. వారసుడు సంక్రాంతికి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుందని నమ్ముతున్నాను. వారసుడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది.’’ అన్నారు

‘వాల్తేరు వీరయ్య’ ‘పూనకాలు లోడింగ్’ విడుదల

పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని నాల్గవ పాటను చూడండి.…

సంక్రాంతికి సిక్స్ కొడుతున్న టాలీవుడ్

సంక్రాంతి వార్ ఫిక్స్ అయిపోయింది. ప్రధానంగా పోటీ అంతా చిరంజీవి, బాలకృష్ణల మధ్యే ఉంటుందని అంతా భావిస్తున్నా.. థియేటర్స్ చేతిలో ఉండటం వల్ల దిల్ రాజు కూడా తన వారసుడుచిత్రాన్ని భారీగానే విడుదల చేస్తున్నాడు. దీంతో వారసుడు హీరో విజయ్ కూడా…

బుట్టబొమ్మకు గట్టి షాక్ ఇచ్చిన 2022

క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో తిరగులేని వేగంతో దూసుకుపోతోంది పూజాహెగ్డే. తను తెలుగులో ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన దువ్వాడ జగన్నాథమ్ లో అమ్మడి బికిని షోకు టాలీవుడ్…

సత్యదేవ్ లో హీరో మెటీరియల్ కాదా..?

కొందరు ఆర్టిస్టులను చూస్తే ఓ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. వాళ్లు ఏ పాత్రైనా చేయగలరు అనిపించుకుంటారు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోతారు. ఆఫర్స్ రాకో ఇంకే కారణాలో చెప్పలేం కానీ.. తెలుగులో ఇలాంటి ఆర్టిస్టులు తక్కువే. ఆ తక్కువలో ఈ…

బాలయ్య చెప్పాడు.. ఇంక వీరయ్యదే లేట్

సంక్రాంతి వార్ ఫిక్స్ అయింది. కానీ ఎవరు ఎప్పుడు వస్తున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఫైట్ దిగుతుండటంతో మరోసారి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు…

బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ ‘వాల్తేర్ వీరయ్య’ సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. రేపు అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై  గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే  గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ  పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని  ట్వీట్ చేశారు బాబీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి పీఆర్వో: వంశీ-శేఖర్ పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మార్కెటింగ్: ఫస్ట్ షో

పవన్ ను అలా చిరంజీవి ని ఇలా లైన్ లో పెడుతోన్న బిజెపి

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు. అందుకే రకరకాల పార్టీల మధ్య ఇన్ని జంపింగులు చేస్తుంటారు నాయకులు. లేటెస్ట్ గా చిరంజీవి తనలాంటి సున్నిత మనస్కులు పాలిటిక్స్ లో రాణించలేరు.. కానీ పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి సాధిస్తాడు అంటూ…