‘హరి హర వీరమల్లు’ పార్ట్ 1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పీరియడ్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ నుంచి ఊహించని అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు క్లారిటీ ఇస్తూనే.. ‘హర హర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ టీజర్ రిలీజ్ చేసింది టీమ్.

వేలాదిమందితో వెట్టిచాకిరి చేయిస్తున్న విజువల్స్ తో టీజర్ మొదలైంది. ‘మన ప్రాణాలకు విలువేలేదా నాన్న.. మనల్ని ఇంత హింసించి.. మన కష్టాల్ని దోచుకుంటున్నారు.. అంటూ ఓ పాప చెప్పే డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ఆ తర్వాత ‘ ప్రతీ వాడిని వాడి పై ఉన్న వాడు దోచుకుంటాడు.. మనల్ని దొర దోచుకుంటున్నాడు.. వాడిని గోల్కొండ నవాబు దోచుకుంటాడు.. ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొఘలు చక్రవర్తి.. అయితే.. మన పై నున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకడిని పంపిస్తాడు.. వాడొచ్చి ఈ దొంగ దొరలందరి లెక్కలూ సరిచేస్తాడు..’ అనగానే వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయింది.

మొఘలుల కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ‘హరి హర వీరమల్లు’ చిత్రంలోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అప్పటి గోల్కొండ కోట, చార్మినార్, ఢిల్లీ వంటి ప్రదేశాలు టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. మొఘల చక్రవర్తి పాత్రలో బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నాజర్, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎమ్.రత్నం, ఎ.దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దర్శకుడిపైనా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కొంతభాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిచేస్తున్నారు. ఈనేపథ్యంలో.. ‘హరి హర వీరమల్లు’కి క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరి పేర్లూ వేశారు. ఇక.. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ ఏడాదే ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts