తమిళ్ లో హిట్ కొట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

షార్ట్ పీరియడ్ లోనే టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా మారింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ నిర్మాణ సంస్థ పేరులోనే ఫ్యాక్టరీ అని ఉంది. అలాగే.. తమ సంస్థ నుంచి ఓ ఫ్యాక్టరీ మోడల్ లో సినిమాలు నిర్మిస్తున్నామని.. త్వరలోనే వంద చిత్రాల మైలురాయిని చేరుకోవడం తమ టార్గెట్ అంటూ చెబుతూ వస్తున్నారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. ఈ ఏడాది ఏకంగా తెలుగులో 15 సినిమాలు విడుదల చేయాలనేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టార్గెట్. అంటే సగటున నెలకు ఒక సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు తమిళంలోనూ తమ తొలి చిత్రాన్ని విడుదల చేసింది ఈ సంస్థ. కమెడియన్ సంతానం లీడ్ రోల్ లో నటించిన ‘వడక్కుపట్టి రామసామి’ సినిమాను నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. లేటెస్ట్ గా రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మొత్తంమీద.. తెలుగులోనే కాకుండా పరభాషాల్లోనూ దూకుడు పెంచుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

Related Posts