డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ వాయిదా..!

మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి. ఆరోజును డైరెక్టర్స్ డే గా జరుపుకుంటుంది టాలీవుడ్. ఇక.. ఈసారి మే 4న దర్శకుల దినోత్సవాన్ని గ్రాండ్ లెవెల్ లో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్ ను నెవర్ బిఫోర్ అన్న రీతిలో డిజైన్ చేసింది డైరెక్టర్స్ అసోసియేషన్. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి మొదలుకొని, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్స్ చేసే సందడి సమ్‌థింగ్ స్పెషల్ గా ఉండబోతుందనే ప్రచారం జరిగింది.

అయితే.. ఆల్ ఆఫ్ సడెన్ గా డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి నేపథ్యంలో.. ప్రముఖ నాయకుల కార్యక్రమాల కారణంగా పోలీస్ లా అండ్ ఆర్డర్ కారణాలతో ఈ కార్యక్రమానికి పర్మిషన్ ని రద్దుచేయడం జరిగిందట. మరో రెండు రోజులలో ఈ కార్యక్రమం మరలా ఏ తేదీన నిర్వహించేది తెలియచేస్తామని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్ తెలియజేసారు.

Related Posts