UV Creations : ప్రభాస్ కు యూవీ క్రియేషన్స్ కు చెడిందా..?

తెలుగులో ప్రతి హీరోకూ ఓ సొంత బ్యానర్ ఉంది. ప్రభాస్ కు కూడా తన పెదనాన్న స్థాపించిన గోపీకృష్ణా బ్యానర్ ఉంది. అయితే ఈ బ్యానర్ కంటే మద్యలో వచ్చిన యూవీ క్రియేషన్స్ ఆయన సొంత బ్యానర్ లా మారింది. అందుకు కారణం అది తన కజిన్స్ దే కావడం.

ఈ బ్యానర్ ను నిలబెట్టిందే ప్రభాస్. వీళ్లు బయటి హీరోలతో సినిమాలు చేసినా.. తను సపోర్ట్ చేస్తుంటాడు. అందుకే టాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ దే అన్నంతగా ముద్ర పడిపోయింది. మరి ఏమైందో కానీ సడెన్ గా యూవీ క్రియేషన్స్ లో చీలికలు మొదలయ్యాయి.

మొదట్నుంచీ ఈ బ్యానర్ లో కీలకంగా వ్యవహరించిన విక్రమ్ అనే వ్యక్తి రామ్ చరణ్‌ తో స్నేహం కారణంగా ఆయనతో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేశాడు. ఇటు చూస్తే ఈ బ్యానర్ లో ఆల్రెడీ కమిట్ అయిన ప్రభాస్ సినిమాలను వేరే వారికి అమ్మేస్తున్నారు. అందులో ప్రధానంగా కనిపిస్తోన్న చిత్రం ‘స్పిరిట్’


అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రాన్ని మొదట యూవీ క్రియేషన్స్ లోనే తెరకెక్కించాలనుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ చేతులు మారింది. యూవీ వాళ్లు ఓ ఫ్యాన్సీ రేట్ కు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను పీపుల్స్ మీడియా వారికి ట్రాన్స్ ఫర్ చేశారు. అంతేకాక ప్రభాస్ సినిమాల బిజినెస్ లలో కీలకంగా ఉండే యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను కాదని ఆదిపురుష్‌ తెలుగు రైట్స్ ను కూడా పీపుల్స్ మీడియా వారికే ఇచ్చారు అంటున్నారు. నిజానికి ప్రభాస్ చెబితే అది యూవీ ని దాటదు. అయినా వెళ్లిపోయిందంటే కారణం.. ఈ బ్యానర్ కు, ప్రభాస్ కు మధ్య గ్యాప్ వచ్చిందనే కదా అర్థం అని అంటున్నారు చాలామంది.


మామూలుగా యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్ అని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. అలాంటి బ్యానర్ నుంచి ప్రభాస్ స్వయంగా తప్పుకుంటూ ఉండటం.. ఆ బ్యానర్ లోనే చీలకలు వచ్చి.. వేర్వేరు కుంపట్లు పెట్టుకుంటుండటంతో ప్రభాస్ కు ఆ బ్యానర్ కు చెడిందా అంటున్నారు.

అదే నిజమైతే ఇది కేవలం బిజినెస్ పరంగా మాత్రమే కాక.. ప్రభాస్ కు ఫ్యామిలీ పరంగానూ కొన్ని డిఫరెన్సెస్‌ వచ్చినట్టుగానే అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఈ మధ్య యూవీ క్రియేషన్స్ సెంటర్ పాయింట్ గా వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇక యూవీ వారితో ప్రభాస్ కటీఫ్ చెప్పాడనే అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది వాళ్లే చెప్పాలి.

Related Posts